Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో భారీ ఎన్‌కౌంటర్ - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్ ఖతం

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (09:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్‌గా పేరొందిన నవీన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈయన 20కి పైగా కేసుల్లో నిందితుడుగా ఉన్నారు. 
 
హాపుర్‌లో ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన నవీన్ కుమార్ అక్కడికి వచ్చారు. పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారెన్స్ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్‌గా గుర్తింపుపొందాడు. ఆయనపై ఢిల్లీ, యూపీలలో హత్య, హత్యాయత్న, కిడ్నాప్, దోపిడీ కేసులతోపాటు దాదాపు 20కి పైగా కేసులు ఉన్నట్టు తేలింది. 
 
కాగా, కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి అనేక మార్లు హత్యా బెదిరింపులు వచ్చిన విషయం తెల్సిందే. సల్మాన్‌ను హత్య చేసేదుకు లారన్స్ గ్యాంగ్ పలుమార్పు కుట్రపన్ని విఫలమైంది కూడా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments