Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రావాలి విజయ్.. కావాలి విజయ్' ... జగన్ - విజయ్ - పీకే ఫోటోలతో పోస్టర్లు (Video)

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (13:54 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రావాలి విజయ్.. కావాలి విజయ్ అంటూ అందులో పేర్కొన్నారు. అంతేనా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడామని జగన్, పీకే (ప్రశాంత్ కిషోర్) చెబుతున్నట్టు అందులో ఉంది. అలాగే, ఇపుడు తమిళనాడును కాపాడాలని అందులో పేర్కొన్నారు. 
 
ఈ పోస్టర్లు ఇపుడు తమిళనాట కలకలం సృష్టిస్తున్నాయి. ఆ పోస్టర్లలో జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉండడం గమనార్హం. వీరిద్దరు కలిసి విజయ్‌ను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి. "ఆంధ్రాను తాము కాపాడామని, పతనావస్థకు చేరిన తమిళనాడును మీరే కాపాడాలనీ, ప్రజాక్షేమాన్ని ఆకాంక్షించి రంగంలోకి రావాలంటూ" ఆ పోస్టర్లలో పెద్దపెద్ద అక్షరాలతో రాశారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెల్సిందే. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏపీలో ప్రభుత్వం ఏర్పాటైంది. తాము ఏపీకి కాపాడుకున్నామని, ఇప్పుడు తమిళనాడును కాపాడుకోవడానికి విజయ్‌ కావాలని జగన్, పీకే కలిసి విజయ్‌కు చెబుతున్నట్లు ఈ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
 
కాగా, ఇప్పటికే ప్రశాంత్‌ కిశోర్‌తో విజయ్‌ చర్చలు జరిపాడన్న ప్రచారం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే మండిపడుతోన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో వైఎస్‌ జగన్‌ బొమ్మ ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వీటిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, కొందరు విమర్శలు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments