Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలి : తికాయత్

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:33 IST)
కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేతర రాకేష్ తికాయత్... తాజాగా దేశ ప్రజలకు మరో పిలుపునిచ్చారు. దేశాన్ని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడాలని ఆయన కోరారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగింస్తూ, ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌, సేవ్‌ ఫార్మర్‌’ అనే నినాదాన్ని ఇచ్చారు. 
 
‘కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం కంపెనీల గురించే ఆలోచిస్తోంది. ప్రభుత్వం భాజపా చేతిలో కాకుండా.. కంపెనీల చేతిలో నడుస్తోంది. కాబట్టి దేశాన్ని ఈ కంపెనీల రాజ్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ పేరుతో పలు కంపెనీలు రైతుల భూములపై కన్ను వేశాయి. కేంద్రం దేశాన్ని ఆయా కంపెనీలకు అమ్ముతోంది’ అని టికాయిత్‌ ఆరోపించారు. 
 
ఈ సందర్భంగా భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అన్ని కులాలు, మతాలు సమానమే.. కాబట్టి నియంతలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి దీటుగా బదులివ్వాలివ్వాలని పిలుపునిచ్చారు. 
 
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నిరసన చేస్తున్న రైతులతో కేంద్రం దఫాల వారీగా చర్చలు నిర్వహించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments