Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డనే రూ.10లక్షలకు అమ్మేసిన తల్లిదండ్రులు..!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:18 IST)
కన్నబిడ్డనే తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టాడు. చెన్నైకి చెందిన బిజినెస్ మ్యాన్ కు తమ పదేళ్ల కూతురును రూ.10 లక్షలకు అమ్మిన తల్లిదండ్రులను సేలం పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలికను దత్తత తీసుకోకుండా అక్రమ పద్ధతుల్లో కొనుగోలు చేసిన పారిశ్రామికవేత్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సేలం అన్నాదానపట్టిలో సతీష్‌కుమార్‌(30), సుమతి (26) అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. 
 
సుమతి కొన్నేళ్ల క్రితం చెన్నైలో ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ యజమాని కృష్ణన్‌ ఇంటిలో పనిమనిషిగా వుండేది. ఆ తర్వాత ఆమె స్వస్థలానికి తిరిగి వెళ్లింది. ఆ తర్వాత కృష్ణన్‌ మనస్పర్థల కారణంగా భార్యను విడిచిపెట్టి ఒంటరిగా గడుపుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా సుమతి తన కుమార్తెను రూ.10 లక్షలకు కృష్ణన్‌కు అమ్మేసింది. అయితే సుమతి తల్లి చిన్నపొన్ను ఈ విషయాన్ని పసిగట్టింది. కొద్ది రోజులుగా తన మనమరాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరపడంతో అసలు గుట్టు రట్టయ్యింది. బాలికను అమ్మిన సుమతి, సతీష్‌కుమార్‌ను, పారిశ్రామికవేత్త కృష్ణన్‌ను పోలీసులు అరెస్టుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments