Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

ఠాగూర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (19:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో తన ప్రియుడుతో కలిసి భర్తను మట్టుబెట్టిన ముస్కాన్ అనే నిందితురాలు జైలులో ఉంది. కానీ ఆమె గర్భందాల్చింది. ఇపుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అన్నదానిపై చర్చ సాగుతోంది. మృతుడు సౌరభ్ రాజ్‌పుత్ కుటుంబీకులు కూడా ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల కోసం లండన్ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన సౌరభ్‌ను ఆయన భార్య ముస్కాన్ మార్చి 3వ తేదీన తన ప్రియుడుతో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో కప్పేసింది. ఈ విషయాన్ని సౌరభ్ కుమార్తె చెప్పడంతో ఈ హత్య గుట్టు వెలుగు చూసింది. 
 
తన భర్తను హత్య చేసిన తర్వాత కూడా ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి వివిధ పర్యాటక ప్రాంతాల్లో విహరించింది. భర్త విదేశాల్లో ఉన్నపుడు కూడా ప్రియుడుతో ఎంజాయ్ చేసింది. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు భార్యతో ఏకాంతంగా గడిపాడు. ఈ పరిస్థితుల్లో ముస్కాన్ గర్భానికి కారణం ఎవరు అన్నదానిపైనే ఇపుడు చర్చ సాగుతోంది. 
 
అందుకే ముస్కాన్‌కు పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ పరీక్ష చేయాలని సౌరభ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ఆ బిడ్డకు సౌరభే తండ్రి అని తేలితే ఆ పసికందును తామే పెంచుతామని, ఒకవేళ సాహిల్ బిడ్డ అని తేలితే తమకు ఎలాంటి సంబంధం లేదని సౌరభ్ కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments