Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ శిక్షపై అప్పీల్ చేస్తే 34 యేళ్ల శిక్ష విధించిన కోర్టు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (08:20 IST)
తనకు విధించిన ఆరేళ్ళ శిక్షా కాలంపై అప్పీల్ చేసిన ఓ బాధితురాలికి కోర్టు ఏకంగా 34 యేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సౌదీ అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్లు చేయడమే ఆమె చేసిన నేరం. పైగా, బాధితురాలు లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్స్ స్కాలర్‌గా ఉంటున్నారు. ఈమె సౌదీలో అడుగుపెట్టగానే సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ విస్మయం చెందే ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న సల్మా గతేడాది జనవరిలో సెలవులకు సౌదీ వచ్చారు. దేశంలో ఆమె అడుగుపెట్టగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సౌదీలోని అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్ చేసిన అభియోగాలపై ఆమెను అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సల్మాకు తొలుత ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ తీర్పును సల్మా పైకోర్టులో సవాలు చేశారు. అయితే, అక్కడామెకు చేదు అనుభవం ఎదురైంది. పై కోర్టు ఆమెకు ఏకంగా 34 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి పేరు సల్మా అల్ షెబాజ్. అక్కడి మైనారిటీ వర్గమైన షియా ముస్లిం వర్గానికి చెందిన ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments