Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాసాగర్‌తో శశికళ భేటీ.. సీఎం ఛాన్సివ్వండి సార్ అంటూ విజ్ఞప్తి.. అక్రమాస్తుల కేసు వచ్చే వారానికి?

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో శశికళ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శశికళ వెంట 10 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు శశికళ అందజేశారు. ప్రభ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:28 IST)
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో శశికళ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శశికళ వెంట 10 మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. 130 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు శశికళ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌ను శశికళ కోరింది.

తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో చిన్నమ్మ చర్చించారు. పన్నీర్ సెల్వం వ్యవహారంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు తనకు అవకాశం ఇవ్వాలని శశికళ విద్యాసాగర్‌ను కోరారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. 
 
ఇదిలా ఉంటే.. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదు కాలేదు. దీంతో, ఈ కేసుపై తీర్పు వచ్చే వారంలో వెలువడే అవకాశముందని సమాచారం. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతో పాటు, ఆమె కుటుంబ సభ్యులను కర్ణాటకలోని దిగుర కోర్టు దోషిగా తేల్చడం, ఈ తీర్పును సవాల్  చేయడంతో కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ కేసును కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ, కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జయలలిత మృతి చెందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ సీఎం పదవికి పోటీ పడుతుండటంతో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments