Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళకు కంట్లో నలుసుగా మారిన పన్నీర్.. మిస్డ్ కాల్ సర్వేలో ''అన్న''దే పైచేయి..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో నలుసుగా మారారు. పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తూ.. శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకు తోడు పన్నీరుకు

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (19:43 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం కంట్లో నలుసుగా మారారు. పన్నీర్ సెల్వం దూకుడుగా దూసుకెళ్తూ.. శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇందుకు తోడు పన్నీరుకు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. ఆన్ లైన్ సర్వే, మొబైల్ మిస్డ్ కాల్ ద్వారా ఓటేసే పద్ధతికి మంచి క్రేజ్ లభిస్తోంది.

సోషల్ మీడియాలో పన్నీరుకు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. మిస్డ్ కాల్ ఇచ్చి పన్నీరుకు మద్దతిస్తున్నామని అనేకమంది ప్రజలు ముందుకొస్తున్నారు. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చే కాల్స్ భారీ ఎత్తున వస్తున్నాయని.. పన్నీర్ క్యాంప్ తెలిపింది. ఇంకా సోషల్ మీడియా ద్వారా మద్దతు పలికే వారికి పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు.
 
మరోవైపు ఎమ్మెల్యేల మద్దతు కూడా పన్నీరుకు పెరుగుతూనే ఉంది. ఊహించనిరీతిలో ఆయనకు మద్దతు వెల్లువెత్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్‌, ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్‌, పీఆర్‌ సుందరం పన్నీర్‌ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్‌ శ్రీనివాస్‌ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
 
తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్‌ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్‌ శ్రీనివాసన్‌కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్‌ సెల్వం గూటికి చేరుతుండటం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్‌ కూడా చిన్నమ్మకు ఝలక్‌ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్‌ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
అన్నాడీఎంకేను విచ్ఛిన్నం కాకుండా కాపాడే శక్తి పన్నీర్‌ సెల్వానికి ఉందని ప్రకటించారు. పొన్నియన్‌ రాకతో సెల్వం వర్గం మరింత పుంజుకుంది. పన్నీరుకే సీఎం పదవి దక్కుతుందని టాక్ వస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments