Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల్లో మహిళల అంగాంగ ప్రదర్శనలు.. చూసి ఆనందిస్తున్న పురుషులు..

కేరళ రాష్ట్రానికి సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళలు తడిసిన దుస్తుల్లో ఆలయాలకు వెళ్లేంది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకేనంటూ వ్యాఖ్యానించారు.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (09:17 IST)
కేరళ రాష్ట్రానికి సీపీఎం ఎంపీ పీకే శ్రీమతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హిందూ మహిళలు తడిసిన దుస్తుల్లో ఆలయాలకు వెళ్లేంది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకేనంటూ వ్యాఖ్యానించారు. ఈ అంగాంగ ప్రదర్శనను ఆలయాలకు వెళ్లే పురుషులు చూసి ఆనందిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
శబరిమల పుణ్యక్షేత్రంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు ఈ తీర్పును తప్పుబడుతుంటే సంఘ్ పరివార్ సంస్థలు మాత్రం స్వాగతిస్తున్నాయి. 
 
ఈపరిస్థితుల్లో కేరళ రాష్ట్ర సీపీఎం ఎంపీ శ్రీమతి మాట్లాడుతూ, హిందూ మహిళలు కోనేర్లలో స్నానం చేసి తడిసిన దుస్తులతో ఆలయాల్లోకి వెళ్లేది అక్కడున్న పురుషులకు తమ అంగాంగాలను ప్రదర్శించేందుకే. ఆ దృశ్యాలను చూసి ఆనందించేందుకే మగవాళ్లూ ఆలయాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, శబరిమల తీర్పును అడ్డుపెట్టుకొని ఆరెస్సెస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి కేరళ ప్రభుత్వం, సీఎం విజయన్‌పై తిరుగుబాటుకు కుట్ర పన్నుతున్నాయి. సమానత్వ హక్కును ఏ ఒక్కరూ కాదనలేరు. సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. 
 
అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీ కేరళలో అనేక సామాజిక దురాచారాలను రూపుమాపింది. గతంలో 41 రోజుల దీక్ష ముగిసిన తర్వాత అయ్యప్ప భక్తులు కాళ్లకు చెప్పుల్లేకుండా శబరి కొండకు వచ్చేవారు. కానీ, ప్రస్తుతం చెప్పులు ధరించి వెళ్లేవారిని ఎంతో మందిని చూస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments