Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనాతన ధర్మంపై ఎవరూ కామెంట్స్ చేయొద్దు : సీఎం ఎంకే స్టాలిన్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (13:20 IST)
సనాతన ధర్మపై తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ సంస్థల నేతలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి ఉదయనిధిపై కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
'సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఒక కేంద్రమంత్రి ప్రతి రోజూ సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్‌లో మనం పడిపోకూడదు' అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
కాగా, హిందువులు అనుసరించే సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా, ఎయిడ్స్ వ్యాధులతో పోలిస్తూ, దీన్ని సమాజం నుంచి నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రుల నుంచి, ఎంతో మంది తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యల ద్వారా ఉదయనిధి దేశవ్యాప్త చర్చకు తెరతీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments