Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదురుతున్న సాయి జన్మభూమి వివాదం

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (09:00 IST)
సాయి జన్మభూమి వివాదం మరింత ముదురుతోంది. మహారాష్ట్ర పర్బనీ జిల్లా పాథ్రీ సాయి జన్మస్థానమని వస్తున్న వాదనలు రాజకీయ వివాదానికి దారి తీస్తోంది. పాథ్రీ అభివృద్ధి కోసం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే 100 కోట్లు విడుదల చేశారు.
 
 ఈ నేపథ్యంలో సాయి కర్మభూమిగా భావించే శిరిడీలో ఆందోళనలు మొదలయ్యాయి. పాథ్రీ అభివృద్ధిని తాము వ్యతిరేకించట్లేదని.. తమ బాధ అంతా సాయి జన్మభూమిగా ప్రచారం చేయటమేనని శిరిడీ వాసులు చెబుతున్నారు.
 
ఈ ప్రచారాన్ని నిరసిస్తూ శిరిడీలో ఆదివారం నుంచి సమ్మె చేపట్టాలని స్థానికులు నిర్ణయించారు. చరిత్రలో మొదటిసారి శిరిడీ మూతపడనుంది. అయితే ఆలయాన్ని మాత్రం మూసివేయమని ఆందోళనకారులు తెలిపారు.
 
శిరిడీకి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తుంటారు. ఈ నిర్ణయంతో భక్తులు, పర్యటకులపై భారీ ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని రెండు రోజుల ముందుగా ప్రకటన చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments