Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి అయ్యప్ప స్వామి దర్శనం... కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఇవ్వాలట...

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (08:06 IST)
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రంలో కూడా భక్తులకు త్వరలోనే దర్శనభాగ్యం కల్పించనున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఆలయంలో భక్తుల దర్శనం గత రెండు మూడు నెలలుగా మూసివేసిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ఈ నెల 14న ఆలయాన్ని తెరిచి నెలవారీ పూజలు నిర్వహిస్తామని, 19 నుంచి ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్.వాసు తెలిపారు. వర్చువల్ క్యూ పద్ధతిలో నమోదు చేసుకున్న భక్తులు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
 
అదేసమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. అది కూడా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో చేయించుకున్నదై ఉండాలని స్పష్టం చేశారు. 
 
అదేవిధంగా భక్తులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. వీరికి పంప, సన్నిధానం వద్ద స్క్రీనింగ్ నిర్వహిస్తామని వివరించారు. ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే దర్శనానికి అనుమతించబోమని తెలిపారు. 
 
కాగా, కరోనా నేపథ్యంలో ఈ తేదీలను వాయిదా వేయాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు బోర్డుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే, అలాంటి లేఖ ఏదీ తమకు అందలేదని, అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ తేదీలను నిర్ణయించినట్టు బోర్డు అధ్యక్షుడు వాసు తెలిపారు. మరోవైపు, ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆలయంలో భక్తులకు ప్రవేశం కల్పించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

తర్వాతి కథనం
Show comments