Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల పదునెట్టాంబడికి వర్షం నుంచి రక్షణ.. హైడ్రాలిక్ రూఫ్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (23:40 IST)
Sabarimala
కేరళలోని శబరిమలలో సుప్రసిద్ధ అయ్యప్పస్వామి ఆలయంలో 18 మెట్లను పదునెట్టాంబడి అని పిలుస్తారు. ఈ మెట్లను పరమ పవిత్రంగా భావిస్తారు. ఇన్నాళ్లు ఈ మెట్లు ఎలాంటి పైకప్పు లేకుండా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ సంస్థ జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగమైంది. 
 
ఈ మెట్లకు వర్షం నుంచి రక్షణ కల్పించేలా హైడ్రాలిక్ రూఫ్ నిర్మిస్తోంది. ఈ యాంత్రిక రూఫ్ డిజైన్‌ను చెన్నైకి చెందిన కాపిటల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ అనే సివిల్ ఇంజినీరింగ్ కంపెనీ రూపొందించింది. వర్షం లేనప్పుడు ఈ హైడ్రాలిక్ రూఫ్ రెండు వైపులా మూసేయవచ్చు. వర్షం వచ్చేటప్పుడు ఓపెన్ చేస్తే రూఫ్‌లా మారిపోతుంది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.70 లక్షలు. అయ్యప్ప స్వామికి తన వంతు కానుకగా ఈ ఖర్చంతా విశ్వ సముద్ర సంస్థ భరిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments