Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.4 వేల కోట్లతో శబరిమలలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం

sabarimala
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (13:25 IST)
కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత పుణ్యస్థలంగా పేరుగడించిన శబరిమల సమీపంలోని ఎరుమేలి సెరువల్లి ఎస్టేట్‌లో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇది శుభవార్త అని ప్రధాని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు.
 
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. సింగపూర్, మలేషియా, నేపాల్ వంటి దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం వివిధ సౌకర్యాలు కల్పించాయి. 
 
ఇపుడు ఈ ప్రాంతానికి విమాన సేవలు కూడా ప్రారంభంకానున్నాయి. శబరిమల సమీపంలోని కొట్టాయం జిల్లాలోని ఎరుమేలి చెరువల్లి ఎస్టేట్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో 2,250 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,000 కోట్లతో విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 
 
ఈ విషయమై కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు దరఖాస్తు చేసింది. రక్షణ శాఖ ఇప్పటికే మొదటి దశ క్లియరెన్స్ ఇచ్చింది. ఇపుడు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా సమ్మతం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Apple store in Delhi: గ్రాండ్ ఓపెనింగ్‌.. భారీగా కస్టమర్‌లు