Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి ఫోటోకు రూ.500లు ఇస్తాం.. నితిన్ గడ్కరీ

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (16:29 IST)
రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ అనేది దేశంలో పెద్ద సమస్యగా మారిపోయింది. దీంతో రాంగ్ పార్కింగ్‌లో పార్కింగ్ చేసిన వాహనాన్ని ఫోటో తీసి పంపితే సదరు వాహనదారుడుకి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని ఫోటో తీసి పంపిన వ్యక్తికి.. 500 రూపాయల రివార్డు ఇస్తామని.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్లను ఆక్రమించి పార్కింగ్ వంటి విషయాల పట్ల విచారం వ్యక్తం చేశారు. 
 
మెట్రో పాలిటన్ సిటీలలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ నియంత్రించడానికి ఇప్పటికే ప్రభుత్వాలు కొన్ని కఠినతరమైన నిర్ణయాలు తీసుకున్నా ఫలితం శూన్యంగా మారిందని నితిన్ గడ్కరీ అన్నారు.
 
దేశవ్యాప్తంగా వాహనాలు పెరుగుతూ ఉండటంతో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయిందని నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తూ.. మరింత ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేస్తున్నారు.
 
ఇంకా రాంగ్ పార్కింగ్ నియంత్రించడానికి.. త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త చటం తీసుకురానున్నట్లు గడ్కరీ ప్రకటించారు. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫోటోని తీసి పంపిస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేయటం.. మాత్రమే కాదు పంపిన వ్యక్తికి 500 రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ వాహనాలను రాంగ్ పార్కింగ్ లో పార్కింగ్ చేస్తే సహించేది లేదని తెలిపారు.
 
ఈ రీతిగా వ్యవహరించే వారి విషయంలో.. అడ్డుకట్ట వేయటానికి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. రాంగ్ పార్కింగ్ కారణంగా ట్రాఫిక్ అనేది దేశంలో పెద్ద సమస్యగా మారిపోయింది అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments