Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్కు ధ‌రించ‌క‌పోతే 10 వేలు జ‌రిమానా.. రెండేళ్ల జైలు శిక్ష‌!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (09:50 IST)
క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేరళ రాష్ర్ట ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంది.  ఏమాత్రం తమ నిబంధనలు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. ఆ మేరకు నిబంధనల్ని జారీ చేసింది. ఆవేమంటే..?
 
గుంపులు గుంపులుగా ఉండ కూడ‌దు. ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కు ధ‌రించాల‌ని ఆదేశించింది.

ఒక వేళ మాస్కు ధ‌రించ‌క‌పోతే రూ. 10 వేలు జ‌రిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష‌ విధిస్తామ‌ని  హెచ్చ‌రించింది. ఈ నిబంధ‌న‌లు ఏడాది కాలం పాటు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది కేర‌ళ ప్ర‌భుత్వం. 
 
ప్ర‌తి వ్య‌క్తి త‌మ నోరు, ముక్కును క‌వ‌ర్ చేసేలా మాస్కు ధ‌రించాలి. ఈ నిబంధ‌న‌ను ర‌ద్దీ ప్రాంతాల‌తో పాటు తాము ప‌ని చేసే ప్రాంతాల్లో క‌చ్చితంగా పాటించాల‌ని చెప్పింది. 
 
ఒక వ్య‌క్తి నుంచి మ‌రో వ్య‌క్తి మ‌ధ్య క‌నీసం ఆరు ఫీట్ల దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. ర‌ద్దీ ప్రాంతాల‌తో పాటు రోడ్లు, ఫుట్ పాత్ ల‌పై ఉమ్మివేయ‌డాన్ని నిషేధించారు.
 
ఈ నిబంధ‌న‌లు పాటించ‌ని యెడ‌ల క‌ఠిన చ‌ర్య‌ల‌కు వెనుకాడ‌మ‌ని ప్ర‌భుత్వం తేల్చిచెప్పింది. పెళ్లిళ్ల‌కు 50 మంది మించి హాజ‌రు కాకూడ‌దు. 
 
ప్ర‌తి వివాహ వేదిక వ‌ద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. పెళ్లికి హాజ‌ర‌య్యే ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాలి. అంత్య‌క్రియ‌ల‌కు కూడా 20 మందికి మించి హాజ‌రు కావొద్దు అని ప్ర‌భుత్వం పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments