థమ్స్ అప్, కోకాకోలాను నిషేధించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్‌కు ధర్మాసనం రూ.ఐదు లక్షల రూపాయల ఫైన్ విధించింది.
పిటిషనర్ తన వాదనల్లో సరైన కారణాలు చూపలేదని, సాంకేతిక సాక్ష్యాలు సరిగ్గా లేకుండానే కేసు వేశారని సుప్రీంకోర్ట్ పేర్కొంది. పిటిషనర్ ఉమేద్ సింగ్ చావ్‌డా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్ట్ ఈ రెండు బ్రాండ్లునే ప్రత్యేకంగా ఎందుకు నిషేధించాలో వివరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొంది.
ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నందున థమ్స్ అప్, కోకా కోలాపై నిషేధం విధించాలని చావ్‌డా ప్రజాప్రయోజనవాజ్యాన్ని దాఖలు చేశారు.
చావ్‌డాకు సుప్రీంకోర్ట్ ఫైన్ విధిస్తూ పిటిషనర్ న్యాయవ్యవస్థను అవమానపరిచాడని, ఆ రెండు బ్రాండ్‌లు ఆరోగ్యానికి హానికరమని ఎటువంటి సాక్ష్యాలు చూపలేదని పేర్కొంది. నెలరోజుల్లోగా చావ్‌డా ఐదు లక్షల రూపాయల సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.