Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 గంటల క్రితం ఆ నటి... డూ ఇట్ టుడే, జస్ట్ డ్యాన్స్ అంది... కట్ చేస్తే...

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని నాడు కవి అన్నట్లే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. విధి చాలా వికృతంగా ప్రవర్తిస్తుంది. అప్పటివరకూ సంతోషంగా వున్నవారిని హఠాత్తుగా ఎత్తుకెళ్లిపోతుంది. సర

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (16:27 IST)
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అని నాడు కవి అన్నట్లే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. విధి చాలా వికృతంగా ప్రవర్తిస్తుంది. అప్పటివరకూ సంతోషంగా వున్నవారిని హఠాత్తుగా ఎత్తుకెళ్లిపోతుంది. సరిగ్గా 20 గంటల క్రితం కోల్ కతాకు చెందిన నటి, మోడల్ తన ట్విట్టర్లో హేపీగా ఓ ట్వీట్ చేసింది. చక్కగా కోల్ కతా బ్రిడ్జికి సమీపంలో డ్యాన్స్ చేస్తూ... డూ ఇట్ టుడే... జస్ట్ డ్యాన్స్ అని ఫోటో పెట్టింది. కానీ తెలతెలవారుతుండగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. 
 
వివరాల్లోకి వెళితే... ప్రముఖ మోడల్, నటి, యాంకర్ సోనికా చౌహాన్ ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్ ఛటోపాధ్యాయ కలసి కోల్‌కతాలో కారులో వెళుతుండగా, కారు అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఆ వేగానికి కారు పేవ్‌మెంట్ పైకి ఎక్కేసింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు హుటాహుటిన అక్కడ చూస్తే కారు ప్రమాదానికి గురైనట్లు తెలుసుకున్నారు. 
 
వెంటనే కారులో వున్నవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే సోనికా చౌహాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఆమె స్నేహితుడు, నటుడు బిక్రమ్ తలకు తీవ్ర గాయమయ్యింది. అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కారును అతివేగంతో నడపడం వల్లనే ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments