Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్ క్యాషియర్‌ తలకు గురిపెట్టిన దొంగ.. క్యాషియర్ కూల్‌గా ఏం చేశాడో తెలుసా?

రెస్టారెంట్ లోనికి దొంగ వచ్చాడు. క్యాషియల్ తలకు తుపాకీ గురిపెట్టాడు. అయితే క్యాషియర్ మాత్రం దొంగ బలం చూసి.. ఏం చేశాడని తెలుసుకోవాలనుందా? అయితే చదవండి. అమెరికాలో గన్ కల్చర్ బాగానే పెరిగిపోతోంది. దోపీడీ

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (16:15 IST)
రెస్టారెంట్ లోనికి దొంగ వచ్చాడు. క్యాషియల్ తలకు తుపాకీ గురిపెట్టాడు. అయితే క్యాషియర్ మాత్రం దొంగ బలం చూసి.. ఏం చేశాడని తెలుసుకోవాలనుందా? అయితే చదవండి. అమెరికాలో గన్ కల్చర్ బాగానే పెరిగిపోతోంది. దోపీడీలు పెచ్చరిల్లిపోతున్నాడు. గన్‌పెట్టి డబ్బులు గుంజేవారు ఎక్కువైపోతున్నారు.

అలాంటి ఘటనే కాన్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాన్సాస్ జిమ్మీ జాన్స్ రెస్టారెంట్లో క్యాషియర్ విధుల్లో ఉండగా.. కస్టమర్‌లా లోపలికి వచ్చిన దొంగ.. మాటలు కలుపుతూ.. జేబులోంచి తుపాకీని బయటకు తీశాడు. 
 
క్యాషియర్ తలకు గురిపెట్టాడు. దీంతో షాక్ తిన్న క్యాషియర్.. దొంగకు ఎదురుతిరగకుండా.. డబ్బులిచ్చేశాడు. గన్‌ తలకు పెట్టినా ఏమాత్రం జడుసుకోకుండా కూల్‌గా దొంగకు డబ్బులిచ్చేందుకు చేతికి వున్న గ్లోవ్‌ను కూడా తీసేశాడు. కౌంటర్లో ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశాడు. 'ఇంకా? ఇవ్వు అంటూ దొంగ గద్దించడంతో 'తీసుకో' అంటూ ఏకంగా క్యాష్ బాక్స్‌ను వాడి చేతుల్లో పెట్టేశాడు.

అయితే, కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్న దుండగుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిని సదరు షాప్ యజమాని సోషల్ మీడియాలో పెట్టడంతో వీడియో వైరల్ అయ్యింది. దొంగ తుపాకీ గురిపెట్టినా కూల్‌గా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకున్న క్యాషియర్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments