Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మా రాజధాని కాదు.. అక్కడ ఉండేది లేదు: పైడికొండల మాణిక్యాలరావు

హైదరాబాద్ తమ రాజధాని కాదని.. తాను అక్కడ ఉండబోనని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం ప్రకటించారు. అంతేగాకుండా తనకు అక్కడ నివాసం అక్కర్లేదని.. తన అధికారిక నివాసాన్ని

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (15:54 IST)
హైదరాబాద్ తమ రాజధాని కాదని.. తాను అక్కడ ఉండబోనని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం  ప్రకటించారు. అంతేగాకుండా తనకు అక్కడ నివాసం అక్కర్లేదని.. తన అధికారిక నివాసాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు 2014లో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో 27వ నెంబర్‌ క్వార్టర్‌ను కేటాయించారు. 
 
ఇతర మంత్రులందరూ తమ హైదరాబాద్ నివాసాన్ని వదులుకోని నేపథ్యంలో మాణిక్యాల మాత్రం తనకు హైదరాబాదులో నివాసం వద్దంటూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీంతో వేరేదారి లేకుండా ఆ క్వార్టర్ కేటాయింపును రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గుంటూరు, విజయవాడ పరిసరాల్లో ఎక్కడ కావాలన్నా మంత్రికి నివాస వసతి కల్పిస్తామని ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
కాగా ఏపీ సచివాలయంతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ హైదరాబాదు నుంచి అమరావతికి తరలివచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల నివాసాలు కూడా మెల్ల మెల్లగా గుంటూరు, విజయవాడలకు చేరుకున్నాయి. అయితే కొందరు మాత్రం హైదరాబాదు నుంచి ఏపీ ప్రభుత్వ పనులు చేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకుని ఏపీకి వచ్చేయాలని పైడికొండల తన నివాసాన్ని వద్దనుకోవడం ద్వారా చెప్పకనే చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments