Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాలు పోతున్నా.. మొబైల్ ఫోన్ దోచుకుని పారిపోయాడు

సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్ద

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (11:13 IST)
సమాజంలో నైతిక విలువలు, ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేకుండా పోతోంది. ఇందుకు తాజాగా ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం కారుతున్న ఓ వ్యక్తిని కనీసం ఆస్పత్రికి తీసుకెళ్దామనో లేక, అంబులెన్స్‌కు ఫోన్ చేద్దామన్న కనీస ఆలోచన చేయకపోగా ఏకంగా గాయపడ్డ వ్యక్తిని దోచుకున్నాడో ప్రబుద్ధుడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ సుభాష్‌నగర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన మతిబూల్ అనే రిక్షా కార్మికుడిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తీవ్రగాయాలకు గురై రక్తమోడుతూ రోడ్డుపై అలాగే పడిపోయాడు. అయితే... ఆ సమయంలో అతన్ని రక్షించేందుకు ఎవరూ రాలేదు. అనంతరం అటువైపుగా వెళ్తున్న మరో రిక్షా కార్మికుడు గాయపడ్డ వ్యక్తిని చూసి కనీసం తన తోటి రిక్షా కార్మికుడని కూడా చూడకుండా అతని మోబైల్ ఫోన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు.
 
కాగా... తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, పోలీసులకు 7 గంటలకు విషయం తెలిసి వారు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే రక్తం అధిక మోతాదులో పోవడంతో అతను మృతిచెందాడు. తాదా. ఆ టెంపో డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే కిందకు దిగి చూసి ఏమీ చేయకుండా వెళ్లిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజి ద్వారా తెలిసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలితో నా 544వ చిత్రాన్ని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది : అనుపమ్ ఖేర్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments