Webdunia - Bharat's app for daily news and videos

Install App

#RKNagarElectionResult : డిపాజిట్ కోల్పోయిన డీఎంకే అభ్యర్థి

చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థి మరుద గణేష్ డిపాజిట్‌ను కోల్పోయారు. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం, ఆధిపత్యపోరు, నేతల కుమ్ములాటలతో పాటు.. అన్నాడీఎంక

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2017 (17:27 IST)
చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థి మరుద గణేష్ డిపాజిట్‌ను కోల్పోయారు. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం, ఆధిపత్యపోరు, నేతల కుమ్ములాటలతో పాటు.. అన్నాడీఎంకే ప్రజా వ్యతిరేక పాలన ఇలా అన్ని అంశాలు తమకు అనుకూలించి ఘన విజయం సాధిస్తామని డీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. 
 
కానీ, ఆర్.కె. నగర్ ఓటర్లు మాత్రం డీఎంకేను షాక్‌కు గురిచేసేలా తీర్పునిచ్చారు. డీఎంకే అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోయేలా తేరుకోలేని షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,76,885 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీటీవీ దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అధికార అన్నాడీఎంకే ఇ.మధుసూదనన్‌కు 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదగణేష్‌కు 24,651 ఓట్లు పోలయ్యాయి. దీంతో డీఎంకే అభ్యర్థితో పాటు నామ్ తమిళర్ కట్చి, బీజేపీ అభ్యర్థి కూడా డిపాజిట్లను కోల్పోయారు. కాగా, ఈ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఏకంగా 40,707 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments