Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#RKNagarElectionResult : 4వ రౌండ్ పూర్తి... దినకరన్ ఆధిక్యం 11816 ఓట్లు

చెన్నై, ఆర్కేనగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ దినకరన్ తన ఆధిక్యతను నిలుపుకున్నారు.

Advertiesment
#RKNagarElectionResult : 4వ రౌండ్ పూర్తి... దినకరన్ ఆధిక్యం 11816 ఓట్లు
, ఆదివారం, 24 డిశెంబరు 2017 (11:32 IST)
చెన్నై, ఆర్కేనగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపులోనూ దినకరన్ తన ఆధిక్యతను నిలుపుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నాలుగో రౌండ్ పూర్తయ్యేవరకు దినకరన్ 11,816 ఓట్ల ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఫలితంగా ఆయన గెలుపు తథ్యమనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్‌ - 20,298, మధుసూదనన్ -9,672, మరుదుగణేష్‌కు - 5,091, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి.
 
మూడో రౌండ్ : దినకరన్‌ - 15868, మధుసూదనన్ - 7,033, మరుదుగణేష్‌కు - 3,750, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117, నామ్ తమిళర్ కట్చి - 737 చొప్పున ఓట్లు పోలయ్యాయి. కాగా, మొదటి, తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి ఓట్లు 66 ఓట్లు పోల్ కాగా, నోటాకు 102 ఓట్లు వచ్చాయి. 
 
అంతకుముందు టీటీవీ దినకర్ వర్గం కార్యకర్తలతో మొదలైన అన్నాడీఎంకే ఏజంట్లు, కార్యకర్తల మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారగా, కౌంటింగ్ అధికారులపై వారు దాడికి దిగారు. దీంతో కౌంటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని రెండు వర్గాలనూ చెదరగొట్టి, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#RKNagarElectionResult : 3వ రౌండ్ పూర్తి.. కొనసాగుతున్న టీటీవీ ఆధిక్యం