Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసు.. రూ.3 కోట్లు చెల్లించాలంటూ...

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (09:49 IST)
రిక్షా కార్మికుడికి ఐటీ శాఖ నోటీసు జారీచేసింది. రూ.3 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.
 
మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్‌ అధికారులు పాన్‌ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. దీంతో ఈ యేడాది 15న బకాల్‌పూర్‌లోని జన్‌ సువిధ కేంద్రంలో పాన్‌ కార్డు కోసం అప్లయ్‌ చేశాడు. 
 
కొన్ని రోజులకు సంజయ్‌ సింగ్‌ అనే వ్యక్తి.. పాన్‌కార్డు కలర్‌ కాపీని ప్రతాప్‌ సింగ్‌కు ఇచ్చాడు. అయితే నిరక్షరాస్యుడైన ప్రకాశ్‌ సింగ్‌ అసలు కార్డుకు, కలర్‌ కాపీకి తేడా గుర్తించలేకపోయారు.
 
కాగా, ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్‌ సింగ్‌కు నోటీసులు జారీచేశారు. తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు. 
 
అయితే తాను రిక్షా కార్మికుడినని చెప్పడంతో తన పాన్‌ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments