Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్ర కోట వ‌ద్ద రిపబ్లిక్ డే పరేడ్... కోవిడ్ మార్గదర్శకాల‌ జారీ

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (14:25 IST)
న్యూఢిల్లీలో ఎర్ర‌కోట వ‌ద్ద ఈనెల 26న రాజ్‌పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరయ్యే వారి కోసం ఢీల్లీ పోలీసులు సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ డోస్‌లు పూర్తిగా వేయించుకుని ఉండాలని, 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించేది లేదని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం సహా కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలని ఓ ట్వీట్‌లో ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
 
 
రిప‌బ్లిక్ డే ప‌రేడ్ లో పాల్గొనే విజటర్ల కోసం సీటింగ్ బ్లాక్‌లు ఉదయం 7 గంటలకు తెరుస్తారని, లిమిటెడ్ పార్కింగ్ కారణంగా విజిటర్లు కార్‌పూల్ లేదా టాక్సీలను వినియోగించాలని మార్గదర్శకాల్లో సూచించారు. వాలీడ్ ఐడెంటిటీ కార్డులు తెచ్చుకోవాలని, సెక్యూరిటీ తనిఖీలకు సహకరించాలని పేర్కొన్నారు. ప్రతి పార్కింగ్ ఏరియాలోనూ రిమోట్ కంట్రోల్డ్ కార్ లాక్ కీలు డిపాజిట్ చేసే వీలు కల్పించినట్టు తెలిపారు. 

 
రిపబ్లిక్ డే సందర్భంగా 27,000 మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నామని, ఎలాంటి ఉగ్రవాద దాడులు చోటుచేసుకోకుండా చర్యలు పటిష్టం చేసామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా తెలిపారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్‌స్పెక్టర్లు పరేడ్‌ కోసం మోహరించినున్నారని, వీరికి 65 కంపెనీల సీఓపీఎఫ్‌లు సహకరిస్తాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments