Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీ వరాల జల్లు: 5G, 6G దిశగా అడుగులు.. వాయిస్ కాల్స్ ఫ్రీ.. రూ.50కే జీబీ

దేశ వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ.. ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గుర

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (12:17 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ.. ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గురించి గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనిల్ అంబానీ మాట్లాడుతూ.. కస్టమర్లకు వరాల జల్లు కురిపించారు. దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. 
 
ఇంకా 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కే జీవీ డాటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 300 పైగా ఛానల్స్ లైవ్‌లో చూడొచ్చు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, 60 వేల మ్యూజిక్ ఉచితంగా పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు. 
 
ఇకపోతే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సేవలను అంకితం చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశంలో కాకుండా ప్రపంచంలో అతి తక్కువ ధరలకు జియో సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రిలయన్స్ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్‌కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్‌గా రూపాంతరం చెందబోతోందన్నారు ఇందులో జియో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇంకా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments