Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైల్లో ఉంచినా ఉద్యమం ఆగదు.. అరెస్ట్ ఎందుకు? నేనే లొంగిపోతా : హార్దిక్ పటేల్

కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. 2015లో పటీదార్ ఉద్యమం సాగినప్పుడు మహేసనా ప్రాంతంలో జరిగి

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (09:26 IST)
కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. 2015లో పటీదార్ ఉద్యమం సాగినప్పుడు మహేసనా ప్రాంతంలో జరిగిన విధ్వంసానికి కారకుడని హార్దిక్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
 
అప్పటినుంచి మహేసనా జిల్లాలోకి హార్దిక్ ప్రవేశాన్ని నిషేధించారు. ఈ విధ్వంసకాండకు సంబంధించి ఆయనపై వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసు విచారణకు ఆయన సక్రమంగా హాజరుకావడం లేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. పోలీసులు తనను అరెస్ట్ చేయాలని భావిస్తే, ఆ అవసరం రానీయబోనని, లొంగిపోయేందుకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. అదేసమయంలో తనను జైల్లో ఉంచినా, పటీదార్ల ఉద్యమం ఆగదన్నాడు. తనపై బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. తాను లొంగిపోతానని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని, పోలీసులు బీజేపీ చెప్పినట్టు చేస్తున్నారని హార్దిక్ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

విడాకుల కేసు : ఎట్టకేలకు కోర్టుకు హాజరైన ధనుష్ - ఐశ్వర్య దంపతులు

భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఛాన్సులు.. పెరిగిన యూత్ ఫాలోయింగ్!!

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments