పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలివే...
విజయవాడ : మీ ఇంట్లో పెళ్ళి ఉందా? అయితే మీరు ఆ ఖర్చుల నిమిత్తం రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు. పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహానికి రూ.2.5 లక్షలు విత్ డ్రా కోసం మీరు చేయల్సిందల్లా... మీ పెళ్లి కార్డ
విజయవాడ : మీ ఇంట్లో పెళ్ళి ఉందా? అయితే మీరు ఆ ఖర్చుల నిమిత్తం రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు. పెళ్లికి డబ్బు విత్ డ్రాపై ఆర్‌బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహానికి రూ.2.5 లక్షలు విత్ డ్రా కోసం మీరు చేయల్సిందల్లా... మీ పెళ్లి కార్డు పట్టుకుని బ్యాంకుకు వెళ్లి... మనీ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ ఇతర సేవలకు ముందస్తు చెల్లింపుల ప్రతులు, వాటి వివరాలు సిద్ధం చేసుకోండి. వాటిని సమర్పించాలని ఆర్‌బీఐ నిబంధన విధించింది.
నవంబర్ 8కు ముందు ఖాతాలో ఉన్న నిధులు మాత్రమే విత్ డ్రా చేసుకునేందుకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. తల్లిదండ్రులు లేదా పెళ్లి చేసుకునే వ్యక్తికి మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో చెక్కులు, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డులు, ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. అవసరమైతే అధికారులకు లావాదేవీల వివరాలను చూపించాలని బ్యాంకులను ఆదేశించింది.