Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్న‌య్య'కు 'త‌మ్ముడు' షాక్, జియోకు మించి ఆర్‌కామ్ బంపర్ ఆఫర్... రూ.149కే అపరిమిత కాల్స్...

ముంబై : అన్న ముఖేశ్ అంబానీ జియోకు తమ్ముడు అనిల్ అంబానీ ఆర్ కామ్‌తో షాకిచ్చారు. వెల్‌కమ్ ఆఫర్‌తో దేశంలోని టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియోకు అనిల్ సారథ్యంలోని ఆర్‌కామ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోరకంగా చెప్పాలంటే మొత్తం మొబైల్ వినియోగదారు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (21:16 IST)
ముంబై : అన్న ముఖేశ్ అంబానీ జియోకు తమ్ముడు అనిల్ అంబానీ ఆర్ కామ్‌తో షాకిచ్చారు. వెల్‌కమ్ ఆఫర్‌తో దేశంలోని టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియోకు అనిల్ సారథ్యంలోని ఆర్‌కామ్ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోరకంగా చెప్పాలంటే మొత్తం మొబైల్ వినియోగదారులను తనవైపు తప్పుకునేలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.149 రీచార్జ్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చంటూ, ఇవాళ బంపరాఫర్ ప్రకటించింది. అంతేకాక ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని పేర్కొంది. 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని వివరించింది.
 
తాజా ఆఫర్ ఇంచుమించు ‘జియో’ను పోలి ఉంది. కానీ, జియో ఆఫర్ కొన్ని ఫోన్లు... అది కూడా 4జీ ఫోన్లకే పరిమితం కాగా ఆర్‌కామ్ ఆఫర్ అన్ని ఫోన్లలోనూ ఉపయోగించుకోవచ్చు. తాజా ఆఫర్‌ దేశంలో మొబైల్ రీచార్జ్‌లో విప్లవం వంటిదని ఆర్‌కామ్ సీఈవో గురుదీప్ సింగ్ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. 
 
తాజా ఆఫర్ 17 ఆర్‌కామ్ సర్కిళ్లలో అందుబాటులో ఉందని, ఐదు తూర్పు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, అసోంతోపాటు ఆర్‌కామ్ నెట్‌వర్క్ లేని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని తెలిపారు. దేశంలో లక్షలాది మంది 2జీ ఫోన్లు కలిగిన వినియోగదారులు ఉన్నారని, వారందరూ ఈ ప్లాన్‌ను చక్కగా ఉపయోగించుకోవచ్చని చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments