హస్తినలో అత్యాచారాల పర్వం... బాలికను ఖాళీ ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి రేప్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (13:18 IST)
దేశరాజధాని హస్తినాపురిలో అత్యాచారాలపర్వం కొనసాగుతోంది. ఓ బాలికతో పాటు.. మరో ఇద్దరు యువతులపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌లో ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఈమె పార్కులో ఆడుకుంటుండగా, తెలిసి వ్యక్తితో పాటు.. మరో ముగ్గురు వ్యక్తులు వచ్చిన పక్కనే ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా సమీప ఫ్లాట్‌కు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడని కళ్యాణ్‌పురి పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
 
అలాగే, పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన కార్యాలయ పనులు ముగించుకుని వచ్చిన యువతిని లిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన నిందితులు మార్గమధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. 
 
నేరానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం