Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్తే... పురిటినొప్పులని తేలింది.. చివరికి?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (09:26 IST)
ఆస్పత్రికి కడుపు ఉబ్బరం అని వెళ్లిన తల్లికి షాక్ తప్పలేదు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని, ఆమె కడుపులో గ్యాస్ ఏర్పడిందని చెప్పింది. దీంతో వైద్యులు ఆ బాలికను జనరల్ వార్డుకు తరలించి టెస్ట్ చేశారు. అయితే పరీక్ష అనంతరం ఆ బాలిక పురిటి నొప్పులతో బాధపడుతోందని తేల్చారు. ఆ మాట విని ఆ బాలిక తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. మరో అరగంటలో ఆ బాలిక ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 
 
ఆపై దాదాపు పది నెలల క్రితం పొరుగింట్లో ఉండే ఓ 24 ఏళ్ల యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. స్కూల్ నుంచి ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ యువకుడు బలవంతంగా తనను పొలం వైపు ఈడ్చుకెళ్లి బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పింది. 
 
ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణం తీస్తానని బెదిరించాడని, అందుకే ఆ విషయం ఎవరికీ చెప్పలేదని తెలిపింది. బాలిక వాంగ్మూలం తర్వాత నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే రోజు అతడిని అరెస్ట్ చేశారు. డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌ సిహోరా సివిల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments