Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపిస్టును కరెంట్ షాకిచ్చి చంపివేసిన మైనర్ బాలిక తండ్రి...!

Webdunia
గురువారం, 4 జులై 2019 (09:36 IST)
మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడికి కరెంట్ షాక్ పెట్టి చంపేశారు. ఈ దారుణానికి మైనర్ బాలిక కుటుంభ సభ్యులు పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన నిందితుడు జైలు శిక్ష అనుభవించి, అనంతరం బెయిల్‌పై ఇంటికి వచ్చిన నేపథ్యంలో నిందితుడిపై కక్ష తీర్చుకున్నారు.జైలు నుండి వచ్చిన వెంటనే నిందితుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇతర కుటుంభ సభ్యుల మధ్యే కరెంట్ షాక్ పెట్టి చంపివేశారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిం. సాధిక్ అనే 22 సంవత్సరాల యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడు. దీంతో సాధిక్‌పై మైనర్ బాలిక అత్యాచార చట్టాలకు సంబంధించి పోస్కో కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు పంపించారు. దీంతో రెండు నెలల పాటు జైలు శిక్ష వహించి ఇరవై రోజుల క్రితం బెయిల్‌పై విడుదల అయి ఇంటికి చేరుకున్నాడు. అయితే అత్యాచారానికి గురి చేసిన యువకుడిపై కక్షను పెంచుకున్న బాలిక కుటుంబ సభ్యులు నిందితుడు కళ్లముందే తిరగడంతో సహించలేక పోయారు. 
 
ఈ నేపథ్యంలోనే బాలిక తండ్రితోపాటు మరో ముగ్గురు సాదిక్ ఇంటికి వెళ్లారు. అనంతంర సాధిక్‌ను ఎలాంటీ గాయాలు గురిచేయకుండా కరెంట్ షాక్ ఇచ్చారు. సాధిక్ చెల్లెలు ఇంట్లో ఉండగానే ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో సాధిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా పోలీసులు హత్యకు పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments