Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. తలనరికేశారు.. నిందితులను ప్రజలు ఏం చేశారంటే?

అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (11:35 IST)
అత్యాచార నిందితులను ప్రజలే శిక్షించారు. చట్టంలో వున్న లొసుగులతో తప్పించుకుని తిరిగేవారు కొందరుంటే... కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల నేరాలు చేసే వారి సంఖ్య మరోవైపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజలే అత్యాచార నిందితులకు శిక్ష విధించారు.

ఇద్దరు అత్యాచార నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో వుంచగా.. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో వున్న ప్రజలు మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని లాకప్‌ నుంచి బయటికి లాక్కొచ్చి చంపేశారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్‌ లోహిత్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తేయాకు తోటలో పనిచేసే సంజయ్ సోబోర్ (30), జగదీష్ లోహార్ (25)లు ఈ నెల 12వ తేదీన ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా చిన్నారి తలను నరికేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాప మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసు విచారణలో సంజయ్, జగదీష్‌లే నిందితులని తేలింది. 
 
పోలీసులు నిందితులు లాకప్‌లో వుంచారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే వందలాది మంది ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. నిందితులను లాకప్ నుంచి వెలుపలికి లాక్కెళ్లి కొట్టి చంపారు. ఈ ఘటనపై నిరసనకారులను అదుపు చేయలేకపోయిన ముగ్గురు పోలీసులను సస్పండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments