Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (12:51 IST)
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు భర్త జతిన్ హుక్కురి కీలక నిర్ణయం తీసుకున్నారు. రన్యా రావు నుంచి విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రముఖ న్యాయవాది ద్వారా రన్యారావు నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ జతిన్ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
గత యేడాది నవంబరు నెల 27వ తేదీన రన్యారావును జతిన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లావెల్లీ రోడ్డులోని ఒక ఖరీదైన ఫ్లాట్‌లో వీరు సంసార జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే, నెల రోజులకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. తాను వద్దన్నా పని ఉందని, వ్యాపారం చేసుకోవాలని ప్రతిసారి ఆమె తరచుగా దుబాయ్‌‍కు వెళ్లి వస్తుండటంతో ఆమె నుంచి జతిన్ దూరమయ్యాడు. 
 
ఈ క్రమంలో గత మార్చి నెల 2వ తేదీ అర్థరాత్రి రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. వీరి అక్రమ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జతిన్‌ను డీఆర్ఐ అధికారులు విచారించగా, బంగారం స్మగ్లింగ్ కేసులో అతని ప్రమేయం లవేదని తేలడంతో అతన్ని వదిలేశారు. ఈ కేసు నుంచి తన భార్య రన్యారావు బయపడినా ఆమెతో కలిసి ఉండటం సాధ్యపడదని భావించిన జతిన్ ఆమె నుంచి విడాకులు కోరుతున్నారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments