Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ హ్యాట్రిక్ సీఎం రాజీనామా.. నరేంద్ర మోడీ తర్వాత ఆయనే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (11:32 IST)
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజీనామా చేశారు. బీజేపీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా, ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అధిక రోజులు సీఎంగా కొనసాగిన ఈ చావల్ బాబా ఇపుడు తన సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని ఈ సందర్భంగా వెల్లడించారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. 
 
కాగా, 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు రమణ్‌సింగే తొలి ముఖ్యమంత్రి. అప్పటి నుంచి గత 15 ఏళ్లుగా ఆయనే సీఎంగా కొనసాగుతున్నారు. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో కొనసాగింది లేదు. 
 
2003, డిసెంబరు 7వ తేదీన తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తర్వాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోడీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్‌ సీఎంగా కొనసాగగా, రమణ్‌సింగ్‌ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా ఐదు వేల రోజులు పూర్తిచేసుకున్నారు. నరేంద్ర మోడీ తర్వాత హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపుపొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments