Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దీదీ ఓ దీదీ' అంటున్న వర్మ.. వీడియో చూసి నవ్వలేక...

Webdunia
సోమవారం, 3 మే 2021 (09:44 IST)
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా.. ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. ఆయనలో క్రియేటివిటీ స్కిల్స్ పుష్కలం అని మరోమారు ఈ వీడియో ద్వారా నిరూపించారు. 
 
తాజాగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అధితార టీఎంసీ విజయభేరీ మోగించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 
 
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ స్పందించారు. అదీ కూడా వీడియో రూపంలో. ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 'దీదీ ఓ దీదీ' అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. 
 
"ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్‌ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్‌ను ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోతుందా యువతి".
 
ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకుంటుంటే... బీజేపీ ఫాలోవర్స్ మాత్రం రాంగోపాల్ వర్మపై విరుచుకుపడుతున్నారు. మరికొందరు వర్మ క్రియేటివిటీని పొగడుతున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments