Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

ఠాగూర్
శుక్రవారం, 30 మే 2025 (18:09 IST)
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పూర్తిగా ముగియలేదని, కేవలం విరామం మాత్రమే ఇచ్చామని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం ప్రదర్శించిన అద్భుతమైన సముద్ర సంసిద్ధతను ఆయన కొనియాడారు. పనిలోపనిగా శత్రుదేశం పాకిస్థాన్‌కు ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. 
 
ఈ అపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ, శక్తిమంతమైన దాడులతో భారత్‌ దూసుకురావడంతో సైనిక చర్యలను ఆపాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించిందని, మనం మన నిబంధనలకు అనుగుణంగానే ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలో నౌకాదళం పాత్ర ప్రశంసనీయమన్నారు. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేయగా, అదే సమయంలో సముద్రంలో మన నౌకాదళం చూపిన సంసిద్ధత పాకిస్థాన్ నౌకాదళాన్ని కనీసం ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా చేసిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ 36వ సినిమా- స్కిల్డ్ మోటార్ సైకిల్ రేసర్‌గా లుక్ అదుర్స్

అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి- 4K డాల్బీ అట్మాస్‌తో శివ రీ రిలీజ్.. నాగార్జున ప్రకటన

Dude: ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా ఫిల్మ్ డ్యూడ్ నుంచి బాగుండు పో రిలీజ్

Itlu Mee Edava : ఇట్లు మీ ఎదవ టైటిల్ గ్లింప్స్ విడుదల.. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments