Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్‌కు రజినీ అదిరిపోయే సలహా.. ఏంటది...?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ విశ్వనటుడు కమల హాసన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు. ఇప్పటివరకు రజినీ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎదురుచూసి చూసీ చివరకు కళ్ళు కాయలుకాచి సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడంపై చర్చ జరిగిం

Webdunia
గురువారం, 16 నవంబరు 2017 (21:29 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ విశ్వనటుడు కమల హాసన్‌కు అదిరిపోయే సలహా ఇచ్చారు. ఇప్పటివరకు రజినీ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎదురుచూసి చూసీ చివరకు కళ్ళు కాయలుకాచి సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడంపై చర్చ జరిగింది. వీరి మధ్య చర్చ జరుగుతుండగానే డిఎంకే పార్టీకి చెందిన ఒక పత్రికా కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. అయితే రాజకీయాలపై మాత్రం వీరు అస్సలు మాట్లాడుకోకుండా కేవలం సినిమా గురించి మాత్రమే చర్చించుకున్నారు.
 
కానీ చాలా గ్యాప్ తరువాత నిన్న రాత్రి కమల్ హాసన్‌కు రజినీ స్వయంగా ఫోన్ చేశారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. అదే కరెక్టు. నాకెందుకో మీలాంటి వారు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉంది అని చెప్పారట. అయితే ఇప్పటికే కమల్ తాను రాజకీయాల్లోకి వచ్చేశానన్న విషయాన్ని రజినీకి గుర్తు చేయగా అది ఓకే కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలి. వారితో కలిసి వారి సమస్యలను పంచుకోవాలి. వాటిపై పోరాటం చేయాలని కమల్‌కు సూచించారట.
 
తాను మెల్లమెల్లగా ప్రస్తుతం రాజకీయాల్లోకి వెళ్ళడానికి అడుగులు వేస్తున్నానని, త్వరలోనే ప్రజా జీవితంలోకి వెళ్ళి వారితో మమేమకవుతానని చెప్పారట కమల్. సినీపరిశ్రమలో ఇద్దరూ మంచి మిత్రులే. రాజకీయాల గురించి మొదటిసారి వీరు ఫోన్లో మాట్లాడుకోవడం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments