Webdunia - Bharat's app for daily news and videos

Install App

చూడు.. నీ కళ్లముందే.. నీ భార్యను రేప్ చేస్తాం.... మాజీ భర్త తమ్ముడి వికృతక్రీడ

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (10:49 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళ మాజీ భర్త సోదరుడు ఓ వికృతక్రీడకు పాల్పడ్డాడు. కట్టుకున్న భర్త కళ్లెదుటే ఓ వివాహితపై తన స్నేహితులతో కలిసి అత్యాచారం జరిపాడు. చూస్తుండు.. నా అన్నను వదిలి నీతో కాపురం చేస్తున్న నీ భార్యను.. నీ కళ్లముందే రేప్ చేస్తున్నామంటూ హెచ్చరిస్తుమరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌లోని భరణ్ జిల్లాకు చెందిన ఓ మహిళ.. తొలి భర్తకు విడాకులిచ్చి.. రెండో భర్తతో కలిసి జీవిస్తోంది. కానీ, రెండో భర్త కళ్లముందే.. తొలి భర్త తమ్ముడు ఆ మహిళపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
పిల్లలు లేకపోవడంతో ఆమె మొదటి భర్త నుంచి వేరుపడిన మహిళ... మరో వ్యక్తిని వివాహమాడింది. అయితే, శనివారం రాత్రి బాధితురాలు తన భర్తతో కలిసి ఇంటి వస్తుండగా.. నిందితుడు తన స్నేహితులతో కలసి ఆమెను అడ్డగించాడు. వాళ్లను బలవంతంగా పక్కనే ఉన్న పొలాల్లోకి లాక్కెళ్లారు. 
 
ఆమె భర్తపై దాడి చేసి కాళ్లూ చేతులూ కట్టేసిన అనంతరం.. నిందితుడు మహిళపై ఆమె భర్త కళ్లుముందే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు, ఆమె భర్త ఎలాగొలా కష్టపడి ప్రధాని రహదారికి చేరుకుని అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
కాగా.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురిపై పోలీసులు అత్యాచారంతో సహా వివిధ సెక్షన్ల కేసు నమోదు చేశారు. ఆదివారం నాడు మాజీ భర్త తమ్ముడితో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

దేవీశ్రీ ప్రసాద్ లేనిదే నా జర్నీ శూన్యం - నా లైఫ్ మార్చింది ఆ దర్శకుడే : తేల్చిచెప్పిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments