Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు క్లాసులని అత్యాచారం... గర్భందాల్చడంతో అబార్షన్.. టీచర్ నిర్వాకం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అదనపు క్లాసుల పేరుతో ఓ విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్, టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ విద్యార్థిని గర్భందాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారు. తాజాగా వ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (09:54 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అదనపు క్లాసుల పేరుతో ఓ విద్యార్థినిపై స్కూల్ డైరెక్టర్, టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ విద్యార్థిని గర్భందాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
రాష్ట్రంలోని శికర్ జిల్లా షహర్ పురాలో నివాసముండే ఓ విద్యార్థినిని అదనపు క్లాసుల పేరుతో స్కూల్ డైరెక్టర్‌ జగదీష్ యాదవ్, టీచర్ జగత్ సింగ్ గుర్జార్‌లు పిలిపించుకునేవారు. ఇద్దరూ కలిసి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించేవారు. ఇంట్లో చెబితే తప్పు తనదే అంటారని భయపడ్డ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం చేయలేకపోయింది.
 
ఈ క్రమంలో విద్యార్థిని గర్భందాల్చింది. దీంతో తాము చిక్కుల్లో పడతామని ఆందోళన చెందిన జగదీష్ యాదవ్, జగత్ సింగ్ గుర్జార్‌లు స్థానికంగా ఆసుపత్రి నడుపుతున్న వైద్య దంపతులు రజ్నీష్ శర్మ, కానన్‌లను సంప్రదించారు. వారు ఆమెకు అబార్షన్ చేసేందుకు అంగీకరించారు. దీంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయడంతో అది వికటించి, ఆమె పరిస్థితి విషమించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల డైరెక్టర్, టీచర్, వైద్యులిద్దర్నీ అరెస్టు చేశారు. రేపిస్టులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయగా, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేయడంపై వైద్యులపై కూడా కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వచ్చే యేడాది జనవరిలో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' రిలీజ్

ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?

దేవకి నందన వాసుదేవ షూట్ అన్నీ ఛాలెంజ్ గా అనిపించాయి : మానస వారణాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం