Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార కేసు పెట్టిందనే కోపంతో.. చీరకట్టుకెళ్లి చంపేశాడు.. ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (16:11 IST)
అత్యాచార బాధితురాలు తనపై కేసు పెట్టిందనే కోపంతో బాధితురాలిని హత్య చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 2020లో అత్యాచారం చేశాడని తనపై కేసు పెట్టిందని కక్షతో ఆడవేషంలో వచ్చి మరీ ఆమెపై దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలో సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. సిరోహి జిల్లాకు చెందిన నేత్రమ్ అనే వ్యక్తి ఇంటి పొరుగునే ఓ వింతువు తన ఇద్దరు పిల్లలు, చెల్లెలితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో పొరుగునే ఉంటున్న ఆమెపై కన్నేసిన నేత్రమ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 2020లో జరిగింది.
 
తనపై జరిగిన దారుణానికి కుమిలిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నేత్రమ్‌ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ మీద బయటకొచ్చాడు నేత్రమ్. అప్పటి నుంచి ఆమెను వేధిస్తున్నాడు. కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరిస్తున్నాడు. పదే పదే బెదిరిస్తు కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాడు. కానీ ఆమె కేసు వెనక్కి తీసుకోను..నీకు శిక్ష పడేదాకా ఊరుకోనంటూ తెగేసి చెప్పింది.
 
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేత్రమ్.. ఆమెను ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో గత అర్థరాత్రి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ఆడవేషం వేసుకున్నాడు. ముసుగు వేసుకుని బాధితురాలి ఇంటికి వెళ్లి..నిద్రపోతున్న ఆమెపై కత్తితో దాడి చేశారు. ఆమె పెద్దగా కేకలు పెట్టటంతో మెలకువ వచ్చిన ఆమె చెల్లెలికి ఇంట్లో ఎవరో అక్కమీద దాడి చేస్తున్నట్లుగా తెలుసుకుంది. అంతే ఒక్కసారిగా లేచి సదరు వ్యక్తిని అడ్డుకోబోయింది. దీంతో ఆమె చెల్లెలిపైనా దాడి చేశాడు.
 
ఆ దాడిలో కట్టుకుని చీర ఊడిపోగా..అతడిని నేత్రమ్ గా గుర్తుపట్టింది బాధితురాలి చెల్లెలు. కానీ అతను కత్తిపోట్లకు బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments