Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 యేళ్ళ విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (18:30 IST)
దేశంలో పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో ఏడో తరగతి చదివే 11 యేళ్ళ బాలికపై ఓ టీచర్ లైంగికదాడికి తెగబడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు సమీపంలో ఝున్‌ఝన్‌హు జిల్లాలో ఈ దారుణం జరిగింది. 11 ఏండ్ల బాలికపై 31 ఏండ్ల టీచర్‌ పాఠశాల ముగిసిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. దీంతో బాధితురాలు కొన్ని రోజులు మౌనం వహించింది. అయితే తరగతి పుస్తకంలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ను చూసిన ఆ బాలిక గురువారం ఫోన్‌ చేసింది. 
 
జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో పిల్లల సంరక్షణ కమిటీ సభ్యులు ఆ బాలిక ఇంటికి వచ్చారు. టీచర్‌ లైంగిక దాడి గురించి ఎస్పీకి తెలిపారు. నిందితుడు ఆమెకు కొంత కాలంగా అసభ్య సందేశాలు పంపుతున్నట్లు చెప్పారు.
 
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అల్వార్ జిల్లాలో కుటుంబంతో కలిసి ఉన్న కీచక ఉపాధ్యాయుడిని  గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడి కుటుంబమంతా విద్యావంతులని, అతడి భార్య కూడా మరో జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం