Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీల కళ్లలో కారం కొట్టి.. నిందితుడిని కాల్చి చంపిన దుండగులు

Webdunia
గురువారం, 13 జులై 2023 (13:55 IST)
ఓ హత్య కేసులోని నిందితులను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళ్తున్న పోలీసుల వాహనంపై ఓ ముఠా దాడి చేసింది. పోలీసుల కళ్లలో కారం కొట్టి ఆ నిందితులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఓ నిందితుడు ప్రాణాలు కోల్పోగా.. మరో నిందితుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 2022లో జరిగిన స్థానిక భాజపా నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా, విజయ్ పాల్ అనే వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వీరిని కోర్టులో కోర్టులో హాజరుపరిచేందుకు స్థానిక పోలీసులు రాజస్థాన్ రవాణాసంస్థకు చెందిన బస్సులో బయలుదేరారు. 
 
ఈ విషయం తెలుసుకున్న దండగులు హలేనా పోలీస్ స్టేషను పరిధిలో ఉన్న అమోలీ టోల్లాజా వద్దకు ఓ కారుతోపాటు రెండు బైకులపై వచ్చిన 12 మందికి పైగా సాయుధులైన దుండగలు వచ్చి, బస్సులోకి ప్రవేశించారు. ఎస్కార్టుగా ఉన్న పోలీసులపై కారం చల్లి ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపి పారిపోయారు. 
 
వారిలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. గాయపడిన నిందితులను స్థానిక ఆస్పత్రికి తరలించగా కుల్దీప్ జఫీనా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments