కన్నతల్లిపై నీచానికి ఒడిగట్టిన కుమారుడు.. నగ్న ఫోటోలను వాట్సాప్ గ్రూపులో పెట్టి?

Webdunia
మంగళవారం, 19 మే 2020 (16:46 IST)
ఆధునిక పోకడల కారణంగా మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కన్నతల్లిపై ఓ ప్రబుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నతల్లి  నగ్న చిత్రాలను వాట్సాప్ గ్రూపులో పంచి నీచానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన ఓ 75ఏళ్ల వద్ధురాలి భర్త 22 రోజుల క్రితమే మరణించాడు. 
 
అప్పటినుంచి ఆస్తి తన పేరున రాయాలంటూ ఆమె 50 ఏళ్ల కుమారుడు తల్లిని పీక్కుతినడం మొదలెట్టాడు. ఈ క్రమంలో మే 13న పనిలో నిమగ్నమైన తల్లిపై ఏదో ద్రవ పదార్థం చల్లాడు. దీంతో ఆమె చర్మంపై దురద మొదలవగా, వెంటనే స్నానానికి వెళ్లి బట్టలు మార్చుకుంది. దీన్నంతటినీ ఆమె కుమారుడు దొంగచాటుగా ఫొటోలు తీశాడు. 
 
అనంతరం ఆమె నగ్న ఫొటోలను వాట్సాప్‌లో బంధువులకు పంపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఆస్తి పత్రాలపై సంతకం పెట్టాలంటూ వేధించాడు. కొడుకు చేసిన నీచపనికి ఆక్రోశం చెందిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments