Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాష్ట్రంలో రూ.450కే సిలిండర్ ధర

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (12:56 IST)
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వంట గ్యాస్ సిలిండర్ హామీ బాగా పని చేసింది. ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ కూడా అధికారంలోకి వస్తే రూ.450కే సిలింటర్ ఇస్తామని ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేలా అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా, తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌ను ఇవ్వనుంది. 
 
అలాగే, రాజస్థాన్ ప్రభుత్వం కూడా రూ.450కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. ఈ ఎన్నికల హామీని జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వెల్లడించారు. అయితే, గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వగా, ఇపుడు బీజేపీ రూ.50 రాయితీతో రూ.450కే ఈ సిలిండర్ ఇవ్వనుంది. ఈ హామీన అమల్లోకి వస్తే అనేక లక్షల మంది అర్హులైన లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారు. 
 
నేడు బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం - హైదరాబాద్‌కు హోం మంత్రి అమిత్ షా
 
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశం గురువారం హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి వస్తున్నారారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా, వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఆయన.. నేరుగా నొవోటెల్ హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటారు. పిమ్మట కొంగరకలాన్‌కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అలాగే, పార్టీ సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సర్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments