Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం - హైదరాబాద్‌కు హోం మంత్రి అమిత్ షా

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (12:29 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ విస్తృత స్థాయి సమావేశం గురువారం హైదరాబాద్ నగరంలో జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరానికి వస్తున్నారారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా, వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకునే ఆయన.. నేరుగా నొవోటెల్ హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుంటారు. పిమ్మట కొంగరకలాన్‌కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. అలాగే, పార్టీ సీనియర్ నేతలు కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సర్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments