Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్‌డౌన్ అయి ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు... 11 మంది మృతి

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:59 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌డౌన్ అయి రోడ్డు పక్కన ఆగివున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది. అలాగే, మంగళవారం కూడా ఇదే రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
గుజరాత్ నుంచి మధురకు కొందరు ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒకటి జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ అయి రోడ్డుపక్కన ఆగిపోయింది. ఈ క్రమంలో వెనుక నుంచి అమిత వేగంతో వచ్చిన ఓ ట్రక్.. ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో వున్న ప్రయాణికుల్లో 11 మంది చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇదే రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments