Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (17:58 IST)
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య జరిగిన మూడు వారాల తర్వాత, మేఘాలయ ప్రభుత్వం అన్ని హోమ్‌స్టేలు, రిసార్ట్‌లు, కుటుంబాలు తాము ఆతిథ్యం ఇచ్చే పర్యాటకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించిందని అధికారులు బుధవారం తెలిపారు.
 
మేఘాలయ పర్యాటక శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని హోమ్‌స్టేలు, రిసార్ట్‌లు మరియు ఇంటి యజమానులు కూడా తమ సందర్శకులందరినీ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, వారి అవసరమైన వివరాలను తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు.
 
ప్రభుత్వం అన్ని హోమ్‌స్టేలు, వసతి యూనిట్లు ఇప్పుడు పర్యాటకులు, సందర్శకులు, అతిథులను టూరిజం యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకునేలా చూస్తుంది. దీనిని ఇప్పటికే 60 శాతం హోమ్‌స్టే యజమానులు. వసతి యూనిట్లు ఉపయోగిస్తున్నాయని తెలిపారు. 
 
హోమ్‌స్టే, రిసార్ట్ యజమానులు పర్యాటకులు, అతిథుల వివరాలను నమోదు చేయకపోతే, దానిని చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామని వసతి యూనిట్ యజమానిపై బాధ్యత పడుతుందని అన్నారు.
 
రాష్ట్రాన్ని సందర్శించేటప్పుడు స్వయంగా డ్రైవ్ చేయాలనుకునే పర్యాటకులు ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని పరిమితులను విధించిందని అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

Sri Vishnu: ఒంగోలు నేపథ్యంలో శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments