ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (17:05 IST)
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మాదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదానికి ఆ విమానంలోని కుడి భాగంలో ఉండే ఇంజిన్ ఓ కారణమా? అనే సందేహం ఇపుడు ఉత్పన్నమవుతోంది. జూన్ 12వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 274 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
సుమారు 12 యేళ్ళుగా వినియోగంలో ఉన్న ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం కుడివైపు ఇంజిన్‌ను కేవలం మూడు నెలల క్రితమే ఓవర్‌హాలింగ్ సమయంలో అమర్చినట్టు అధికారులు గుర్తించారు. ఈ విమానానికి చివరిసారిగా 2023 జూన్ నెలలో నిర్వహణ పనులు చేపట్టగా, తదుపరి షెడ్యూల్ ప్రకారం ఈ యేడాది డిసెంబరు నెలలో నిర్వహించాల్సివుంది. 

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్ 
 
అహ్మదాబాద్‌‍లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదంలో విశ్వాస్ రమేష్ కుమార్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే తన సోదరుడు అంత్యక్రియల్లో పాల్గొని, సోదరుడు పాడె మోశాడు. ఈ దృశ్యం నెట్టింట ఎమోషనల్‌గా మారింది. ఈ విమానంలో అతడితో పాటు ప్రయాణించిన అతని సోదరుడు అజయ్ కుమార్ ప్రాణాలు కోల్పోయిన విషయంతెల్సిందే. 
 
విశ్వాస్ కుమార్ మంగళవారంర రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయిన తర్వాత అతడి సోదరుడి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. డయ్యూకు చెందిన విశ్వాస్, అజయ్‌లు తమ కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత లండన్‌కు తిరిగి వెళుతూ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
 
బుధవారం ఉదయం డయ్యూలో అజయ్ అంత్యక్రియలు నిర్వహించారు. సోదరుడు పార్థివదేహాన్ని చూసి విశ్వాస్ కన్నీటి పర్యంతమయ్యారు. అతడు సోదరుడు పాడె మోస్తున్న వీడియో నెట్టింట పలువురుని కంటతడి పెట్టించింది. ఈ విమాన ప్రమాదంలో బతికి బయటపడ్డ రమేశ్ విశ్వాస్‌ను ఆస్పత్రిలో ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments