Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ ప్రారంభించాం : రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (13:07 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. ఈ ప్రమాదంపై చట్టబద్ధమైన విచారణ ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే, రైలు ప్రమాదం ఘటన వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా వివరించినట్టు తెలిపారు. 
 
కాగా, గురువారం రాత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గౌహతి నుంచి బికనీర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు జుల్పాయ్‌గురి జిల్లాలోని దోహోమోని అనే ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాదం గురువారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న వెంటనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంతో పాటు.. రైల్వే శాఖలు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. 
 
దేశంలో ఇటీవలి కాలంలో రైల్వే ప్రమాదాలు సంభవించలేదు. అంటే 34 నెలల తర్వాత గురువారం ఈ ప్రమాదం జరిగింది. దేశంలో చివరిసారిగా గత 2019 మార్చి 22వ తేదీన రైలు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఇపుడు ప్రమాదం సంభవించింది. 
 
ఈ ప్రమాదంపై మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పందించారు. రైలు ప్రమాదంపై చట్టబద్ధ విచారణ చేపట్టామన్నారు. రైలు ప్రమాద బాధితులను త్వరగా ఆదుకుంటామని చెప్పారు. అలాగే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరిందన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం